తాడిపత్రిలో ఫాక్షనిజం పంజా
అనంతపురం: అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఫాక్షనిజం పంజా విప్పింది. తాడిపత్రిలో ప్రత్యర్థులు వేటకొడవళ్లతో చేసిన దాడిలో సాగర్ అనే వ్యక్తి గాయపడ్డాడు. అతను ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనికి ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారు.
తాడిపత్రిలోని ఒక కాలనీలో ఒక పార్టీకి చెందినవారు ఓటుకు 200 రూపాయల చొప్పున పంచడం మొదలు పెట్టారు. దాన్ని అడ్డుకోవడానికి సాగర్ ప్రయత్నించాడు. దాంతో అవతలి వాళ్లు అతనిపై దాడి చేశారు. ఈ సంఘటనతో తాడిపత్రి పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.












Click it and Unblock the Notifications