కెసిఆర్ ఉన్నట్లా, లేనట్లా?: వైయస్

అధికారంలోకి రాకముందు రాష్ట్ర ప్రజలకు తాము ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని, ప్రజల ప్రశంసలు పొందామని, ఏ రాజకీయ పార్టీకి కూడా తమను ఓడించే సత్తా లేదని ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అన్నారు. అందుకే అన్ని పార్టీలు కలిసి మహాకూటమి ఏర్పాటు చేశాయని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని వంచనకు మారుపేరుగా ఆయన అభివర్ణించారు. చంద్రబాబు హామీలను నమ్మితే ప్రజలకు శఠగోపమేనని అన్నారు. మామ ఎన్టీఆర్ పెట్టిన ఒక్క సంక్షేమ పథకాన్నీ కొనసాగించని చంద్రబాబు కొత్తగా ఇస్తానంటే ఎవరూ నమ్మబోరని ఆయన అన్నారు. ప్రజారాజ్యం గందరగోళరాజ్యంగా మారిందని ప్రజలకు వారేం చేయలేరని అన్నారు.












Click it and Unblock the Notifications