బారాబంకి: సమాజ్ వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పై మరో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతిని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలకు గాను ఆయనపై ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది. దీంతో ఆయనపై ఇప్పటి వరకు మూడు కేసులు నమోదయ్యాయి.
బారాబంకి ఎన్నికల ప్రచార సభలో ఆయన మాయావతిని సోమవారం కించపరుస్తూ సంజయ్ దత్ ప్రసంగించారని ఆరోపణలు వచ్చాయి. ముఖ్యమంత్రికి జాదూ కి జప్పి ఇస్తానని అనడం మాత్రమే కాకుండా ఇతర అమర్యాదకరమైన వ్యాఖ్యలు చేశారు.