భారీ ఎత్తున నగదు, మందు స్వాధీనం
గుంటూరు: రాష్ట్రంలో రెండో దశ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో అధికారులు దాడులను ఉద్రిక్తం చేస్తున్నారు. తనిఖీల్లో ఓటర్లను మభ్యపెట్టెందుకు తీసుకుపోతున్న అక్రమ డబ్బు, మద్యంను స్వాధీనం చేసుకొని సీజ్ చేస్తున్నారు. గుంటూరులో ఓ ప్రజారాజ్యం అభ్యర్థి బంధువు ఇంటిలో రూ.48 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో లింగంపాలెం మండలం ముదునూరు దగ్గర బైక్‌పై వెళుతున్న ఓ వ్యక్తి నుంచి రూ.5 లక్షలు, కృష్టాజిల్లా జగ్గయ్యపేటలో చేసిన సోదాల్లో రూ.12 లక్షలు, ప్రకాశం జిల్లా ఇంకొల్లులో రూ.8.5 లక్షలు, కడప జిల్లా సందేపల్లిలో రూ.7 లక్షలను, ఇదే జిల్లా రాజంపేట బీజేపీ అభ్యర్థి హరినాథ్‌రెడ్డి కుమారుడి నుంచి రూ.2 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications