గుంటూరు: వామపక్షాల మధ్య ఇంకా సదవగాహన పెరిగిన సూచనలు కన్పించడం లేదు. మలి విడత పోలింగ్‌కు మరికొన్ని గంటల మిగిలిఉన్న సమయంలో మరోసారి సీపీఎంపై సీపీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. గంటూరు జిల్లా మంగళగిరిలో స్నేహపూర్వక పోటీ అని చెప్పి సీపీఎం ఎందుకు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తోందని సీపీఐ రాష్ట్ర స్థాయి కార్యదర్శి నారాయణ సూటిగా ప్రశ్నించారు.
సముద్రంలో చేపలు పట్టుకోమంటే సీపీఎం మురికిగుంటలో చేపలు వెతుకుతోందని ఆయన ఎద్దేవా చేశారు. మహాకూటమిలో పొత్తుల ధర్మాన్ని మర్చిపోమని తాము నష్టపోయినా సంకీర్ణధర్మాన్ని పాటిస్తామని నారాయణ స్పష్టం చేశారు.