లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతిని బెదిరించినందుకు సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ పై పోలీసులు కేసును నమోదు చేశారు. యూపీలోని మాల్వాన్ ప్రాంతంలోని హార్డోయిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న దిగ్విజయ్ కోడ్ ఉల్లంఘన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలపై వేధింపులు ఆపకపోతే మాయావతికి వ్యతిరేకంగా సీబీఐని వినియోగిస్తామని ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు. దీంతో దిగ్విజయ్ పై కేసు నమోదు చేశారు.