హైదరాబాద్: తుది విడత ఎన్నికల్లో తెలుగుదేశం నాయకత్వంలోని మహాకూటమి అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అవినీతి, అధిక ధరలు వంటి వాటితో రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ పార్టీ నిలువునా దోచుకున్నదని ఆరోపించారు. కాంగ్రెస్, పీఆర్పీలకు బుద్ధి చెప్పాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పాల్ కు విదేశీ నిధులు నిలిచిపోవడంతో ఆయన ద్వేషం పెంచుకున్నట్టు కనిపిస్తోంది. వైఎస్ అల్లుడు అనిల్ కుమార్ కూడా క్రైస్తవ మత ప్రచారకుడు కావడం పాల్ ద్వేషానికి మరో కారణం.