కెసిఆర్ అవమానిస్తున్నారు: నారాయణ

మహాకూటమిలో ఎవరు ఉంటారో, ఎవరు పోతారో ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాతనే తెలుస్తుందని ఆయన అన్నారు. మహా కూటమిలో ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నాయని ఆయన చెప్పారు. కాంగ్రెసు పార్టీని ఓడించడమే ప్రధాన లక్ష్యంగా మహా కూటమి ఏర్పడిందని, కూటమికి మరో ఎజెండా లేదని ఆయన చెప్పారు. ఫలితాల తర్వాతే ఏ పార్టీ ఏ కూటమిలో ఉండేది తేలుతుందని ఆయన చెప్పారు. రాజకీయ స్పష్టతతోనే తెలంగాణ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆయన చెప్పారు. మేడే నిర్వహించుకోవడానికి రాజకీయ పార్టీలకు అనుమతి ఇవ్వాలని ఆయన ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు ఆయన ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.












Click it and Unblock the Notifications