కరుణానిధి నిరశన దీక్ష విరమణ

దీక్ష విరమింపజేయడానికి అంతకు ముందు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రయత్నించారు. కరుణానిధితో మన్మోహన్ సింగ్ ఫోన్ లో మాట్లాడారు. అయితే కరుణానిధి దీక్ష విరమణకు నిరాకరించారు. తమిళుల రక్షణకు ప్రాణత్యాగానికైనా సిద్ధమేనని కరుణానిధి ప్రకటించారు. ఆయన వెన్నుపూసకు జరిగిన శస్త్ర చికిత్స తర్వాత క్రమంగా కోలుకుంటున్నారు. 85 ఏళ్ల కరుణానిధి సోమవారం ఉదయం పూట మందులు కూడా తీసుకోకుండానే నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఆయన ప్రాణాలకు ఉన్న ముప్పును గమనించి కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రతిస్పందించింది. ప్రధాని మన్మోహన్ సింగ్ కరుణానిధి ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారని, టెలిఫోనులో కరుణానిధితో మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నాయకుడు వీరప్పమొయిలీ ఢిల్లీలో చెప్పారు.












Click it and Unblock the Notifications