అధికారం మాదే: చిరంజీవి

పాలకొల్లులో, తిరుపతిలో తనను ఓడించడమే కాంగ్రెస్ ధ్యేయమని, దీంతో ఈ రెండు శాసనసభా నియోజకవర్గాల్లో కాంగ్రెసు లెక్కలేనంతగా డబ్బులు ఖర్చు చేసిందని ఆయన విమర్శించారు. రిగ్గింగ్ లేకుండా ఎన్నికలు సవ్యంగా నిర్వహిచింనందుకు ఆయన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఐవి సుబ్బారావును, డిజిపి మహంతిని అభినందించారు. ఫలితాలు వచ్చే వరకు జిల్లాల వారీగా పార్టీ సమావేశాలు నిర్వహించనున్నట్లు చిరంజీవి తెలిపారు. అనకాపల్లిలో విజయం తనదేనని ప్రజారాజ్యం ప్రధాన కార్యదర్శి అల్లు అరవింద్ అన్నారు. ప్రభుత్వ ఏర్పాట్లపై సమావేశంలో చర్చించినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications