ఇద్దరు యువకుల హత్య
హైదరాబాద్: హైదరాబాదులోని రాజేంద్ర నగర్ లో గల హసన్ నగర్ లో ఇద్దరు యువకులు హత్యకు గురయ్యారు. చోటూ, జమీల్, మస్తాన్ అనే ముగ్గురు యువకులపై ప్రత్యర్థులు రాళ్లు, ఇతర మారణాయుధాలతో దాడి చేశారు. ఈ దాడిలో చోటూ, జమీల్ అక్కడికక్కడే మరణించగా మస్తాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యవహారాలే ఈ హత్యలకు కారణమని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications