పార్లమెంటులోకి బొమ్మ హెలికాప్టర్ కలకలం

అత్యధునాతనమైన బొమ్మ హెలికాప్టర్ ఒక అడుగు పొడువు ఉంది. తల్కతోరా పశ్చిమ వైపు నుంచి బుధవారం ఉదయం 11 గంటల 10 నిమిషాల ప్రాంతంలో అది పార్లమెంటు హౌసులోకి దూసుకొచ్చింది. 2001లో దాడి జరిగినప్పటి నుంచి పార్లమెంటుకు మూడు కిలోమీటర్ల పరిధి వరకు నో ఫ్లై జోన్ గా ప్రకటించారు.
బొమ్మ హెలికాప్టర్ మాజీ రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ విగ్రహం వద్ద దిగింది. దీన్ని అక్కడ విధులు నిర్వహిస్తున్న సిఆర్పీఎప్ జవాను గుర్తించాడు. వెంటనే అతను కంట్రోల్ రూంను అప్రమత్తం చేశాడు. అది పిల్లలు వాడే హెలికాప్టర్ బొమ్మ కాదని భావిస్తున్నారు. దీని వెనక సాంకేతిక నిపుణుడి పనితనం ఉందని అనుమానిస్తున్నారు. ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉన్న స్థితిలో ఈ సంఘటన జరిగి ఉండవచ్చునని లేదా అనుకోకుండా జరిగి ఉండవచ్చునని, అయితే తాము తేలికగా తీసుకోవడం లేదని భద్రతాధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications