కూలిన బ్రిడ్జి: శిథిలాల కింద ముగ్గురు
కర్నూలు: కర్నూలు జిల్లా మునగలపాడు వద్ద కెసి కెనాల్ పై నిర్మిస్తున్న వంతెన కూలింది. కూలిన వంతెన శిథిలాల కింద ముగ్గురు వ్యక్తులు కూరుకుపోయారు. వారిలో ఒకరు ఇంజనీర్ కాగా మరో ఇద్దరు కూలీలు. వారిని వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. వారు జీవించి ఉండడానికి అవకాశాలు తక్కువేనని అంటున్నారు. వంతెన కూలిన చోట మూడు అడుగుల లోతు నీరు కూడా ఉందని చెబుతున్నారు.
జాతీయ రహదారి విస్తరణలో భాగంగా కెసి కెనాల్ పై వంతెన నిర్మాణాన్ని చేపట్టారు. అయితే గురువారం మధ్యాహ్నం అకస్మాత్తుగా ఆ జాతీయ రహదారి హైవే వంతెన కూలింది. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.












Click it and Unblock the Notifications