ఎయిర్ ఫోర్స్ విమానం కూలి పైలట్ మృతి
న్యూఢిల్లీ: రాజస్థాన్ లోని పోఖ్రాన్ సమీపంలో గురువారం ఎయిర్ ఫోర్స్ సుఖోయ్-30 యుద్ధ విమానం ఒకటి కూలింది. ఈ ప్రమాదంలో పైలట్ మరణించాడు. సుఖోయ్-30 ఎంకెఎల్ యుద్ధ విమానం కూలిపోవడం ఇదే తొలిసారి. ఈ సంఘటన గురువారం ఉదయం 10 గంటల 20 నిమిషాల ప్రాంతంలో జరిగింది.
విమానంలో ఇద్దరు పైలట్లు ఉన్నారు. వారిలో వింగ్ కమాండర్ స్థాయి పైలట్ మృత్యువాత పడ్డాడు. మరో పైలట్ విమానం నుంచి సురక్షితంగా బయట పడగలిగాడు. ఈ సంఘటనపై కోర్టు ఎంక్వయిరీకి ఆదేశించారు.












Click it and Unblock the Notifications