ఒరిస్సాలో వడదెబ్బకు 67 మంది మృతి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మండిపోతున్న ఎండలతో ప్రజలు నానా పాట్లు పడుతున్నా ఒరిస్సాలో ఈ తీవ్రత మరింతగా ఉంది. వడదెబ్బ తాకిడికి ఆ రాష్ట్రంలో ఇప్పటికి 67 మంది మృతి చెందారు. ఒరిస్సాలోని తాల్చేరులో ఎండ తీవ్రత 47 డిగ్రీలను దాటింది. యూపీలో 44 డిగ్రీలు దాటగా మహారాష్ట్రలో 47.1 డిగ్రీగా ఉంది. రాజస్థాన్‌లో 46.2 డిగ్రీలు, హర్యానాలో 42 డిగ్రీలు ఉంది. రాష్ట్రంలో కూడా అనేక జిల్లాల్లో ఉష్ణోగ్రతలు గరిష్ట స్ధాయికి చేరుకున్నాయి. బుధవారం వడదెబ్బకు రాష్ట్రంలో ఆరుగురు మృతి చెందారు. మృతులందరూ తెలంగాణ జిల్లాల వారే. ఆదిలాబాద్, హన్మకొండ, రామగుండం, నల్గొండ పట్టణాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications
