గుజరాత్ అల్లర్లపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులు
న్యూఢిల్లీ: గుజరాత్ అల్లర్ల కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులపై ఉన్న స్టేను సుప్రీంకోర్టు శుక్రవారం ఎత్తేసింది. కేసుల రోజువారీ విచారణకు ఐదు జిల్లాల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కొత్త నిందితులపై అదనపు చార్జిషీట్లు దాఖలు చేయాలని కూడా ఆదేశించింది. అహ్మదాబాద్, గుల్బర్గా, సబర్కాంటా, మెహసనా, ఆనంద్ జిల్లాల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
కేసులను రాష్ట్రం వెలుపల విచారించాలనే మానవ హక్కుల కమిషన్ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. సాక్షులకు కేంద్ర బలగాల రక్షణ కల్పించాలని సూచించింది. ప్రాణాలకు ముప్పు ఉంటే సాక్షులను ఇతర రాష్ట్రాల్లో ఉంచాలని కూడా సూచించింది. సిట్ చైర్మన్, దాని సభ్యులు తమకు మూడు నెలలకు ఒకసారి నివేదిక సమర్పిస్తారని సుప్రీంకోర్టు తెలియజేసింది.












Click it and Unblock the Notifications