గెలుపుపై తెరాసలో ధీమా

ఉత్తర తెలంగాణలో తమ సత్తా చాటుకుంటామని, కరీంనగర్ జిల్లాలో పోటీ చేసిన 10 స్థానాల్లో 8 గెలుచుకుంటామని, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో 14 సీట్లకు పోటీ చేయగా 14 సీట్లు గెలుచుకుంటామని తెరాస నాయకులు అంటున్నారు. నల్లగొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో 11 సీట్లకు పోటీ చేయగా నాలుగు మాత్రమే గెలుచుకునే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. హైదరాబాదులోని ఆరు అసెంబ్లీ స్థానాలకు తెరాస పోటీ చేసింది. వీటిలో గెలుపు దాదాపు అసాధ్యమే.
లోకసభ స్థానాల్లో ఆరింటిలో తాము విజయం సాధించే అవకాశాలున్నట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. మహబూబ్ నగర్ నుంచి పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు, మెదక్ నుంచి పార్టీ సెక్రటరీ జనరల్ విజయశాంతి పోటీ చేశారు. లక్షకు పైగా మెజారిటీలతో వీరు గెలుస్తారని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications