దేశం నేత కేశవయ్య హత్య

అనంతపురం: అనంతపురం జిల్లాలో మరోమారు ఫ్యాక్షన్‌ పడగ విప్పింది. ధర్మవరం పట్టణంలో తెలుగుదేశం నేత అమారా కేశవయ్యను ఆయన ప్రత్యర్థులు నరికి చంపారు. రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌కు సమీపంలోనే ఈ హత్య జరగటం తీవ్ర కలకలం రేకెత్తించింది. ఈ సంఘటనతో పట్టణంలో ఉద్రిక్తత నెలకొనటంతో 144 సెక్షన్‌ విధించారు.

అమరా కేశవయ్య 1991లో చెరువుకట్ట వద్ద జరిగిన నలుగురి హత్య కేసులో నిందితుడు. తెలుగుదేశం మాజీ శాసనసభ్యుడు స్వర్గీయ పరిటాల రవికి సన్నిహితుడైన పోతుల సురేష్ అనుచరుడు. అమరా కేశవయ్య ఆర్వోసిలో పని చేసినట్లు సమాచారం. ప్రత్యర్థులు ఇంట్లోకి వచ్చి కళ్లలో కారం చల్లి వేటకొడవళ్లతో అమరా కేశవయ్యను హత్య చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+