హైద్రాబాద్ లో ఎన్నారైకి ఫ్లూ లక్షణాలు!
హైదరాబాద్: జర్మనీ నుంచి వచ్చిన ఒక ఎన్నారైకి స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉండడంతో షంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆయనను ఆదివారం ఉదయం ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రికి తరలించి పరీక్షలు చేస్తున్నారు. ఈ ఫ్లూ భారతీయులను భయపెడుతున్నా ఇంకా ఏ కేసూ నిర్ధారణ కాలేదు.
ఈ వ్యాధి లక్షణాలతో విదేశాల నుంచి భారత్ వచ్చిన ఆరుగురు వ్యక్తుల నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించగా.. వారికి ఆ వ్యాధి లేదని తేలింది. వీరిలో హైదరాబాద్‌కు చెందిన ఎన్నారై కూడా ఉన్నారు. కొద్దిరోజుల క్రితం అమెరికా నుంచి వచ్చిన ఈయనలో ఫ్లూ లక్షణాలు కనిపించడంతో హైదరాబాద్‌లో కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. మొత్తం ఏడుగురి నమూనాలను ఢిల్లీలోని జాతీయ అంటువ్యాధుల సంస్థ (ఎన్‌ఐసీడీ)లో పరీక్షించారు. ఆరుగురు వ్యక్తులకు ఈ వ్యాధిలేదని తేలింది. లండన్‌కు చెందిన ఒక ఎన్నారైకి సంబంధించిన పరీక్ష ఫలితం ఇంకా రాలేదు. అందువల్ల అతడిని ఢిల్లీలోని రామ్‌మనోహర్ లోహియా ఆసుపత్రిలో పరిశీలనలో ఉంచాలని వైద్యులు నిర్ణయించారు. అయితే అతడు మాత్రం ఢిల్లీలోని తన బంధువుల ఇంట్లో విశ్రాంతి తీసుకుంటానని వెళ్లిపోయినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎన్.కె.చతుర్వేది తెలిపారు.












Click it and Unblock the Notifications