మోదీ కొత్త చరిత్ర - విపక్షాలు కుదేల్, ఒక్క నిర్ణయంతో సీన్ ఛేంజ్..!!

జాతీయ రాజకీయాల్లో కీలక మలుపు. ఎక్కడైతే బలం లేదని వెనుకడుగు వేసారో.. ఇప్పుడు అక్కడే అనుకున్నది సాధిస్తున్నారు. చెప్పిన సమయానికి చెప్పినట్లుగా అనుకున్నది పూర్తి చేస్తున్నారు. ఇందుకు ప్రధాని మోదీ - షా ద్వయం పూర్తి రంగం సిద్దం చేసారు. విపక్షాలు తమదే పై చేయి అనుకుంటున్న వేళ.. ఊహించని షాక్ తో కుదేలు అవుతున్నాయి. ఈ నిర్ణయం మొత్తం రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేస్తుంది. ఇందుకు ముహూర్తం ఖరారైంది.

పార్లమెంట్ వేదికగా కొత్త చరిత్ర లిఖించేందుకు రంగం సిద్దమైంది. ప్రధాని మోదీ - షా మార్క్ రాజకీయం విపక్షాలకు ఊహించని షాక్ గా మారుతోంది. ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో కీలక బిల్లుల ఆమోదానికి ప్రణాళికలు సిద్దం అయ్యాయి. ఏప్రిల్ లో ప్రవేశ పెట్టిన మహిళా రిజర్వేషన్ - డీలిమిటేషన్ బిల్లు కు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. సభకు హాజరై ఓటు వేసిన సభ్యులలో రాజ్యాంగపరంగా అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీకి దూరంగా నిలిచింది. ఇప్పుడు తిరిగి ఈ బిల్లు ఆమోదం పొందాలంటే ప్రస్తుతం లోక్‌సభలో 540 మంది సభ్యులు ఉన్నారు. ఏదైనా రాజ్యాంగ సవరణకు కనీసం 360 మంది ఎంపీల మద్దతు లేదా మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం. ప్రస్తుతం, ఎన్‌డిఎ కు 298 మంది ఎంపీల మద్దతు ఉంది. కాగా, తిరుగుబాటు చేసిన 20 మంది తృణమూల్ ఎంపీలు 'నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా' (NCPI)లో విలీనం కాగా, ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేనకు చెందిన ఆరుగురు ఎంపీలు ఏక్‌నాథ్ షిండే శివసేనలో చేరారు. దీనితో ఎన్‌డిఎ బలం 324కు పెరుగింది.

 'డీలిమిటేషన్' పై జగన్ అనూహ్య నిర్ణయం - ఢిల్లీ కేంద్రంగా, కొత్త లెక్కలు..!!
'డీలిమిటేషన్' పై జగన్ అనూహ్య నిర్ణయం - ఢిల్లీ కేంద్రంగా, కొత్త లెక్కలు..!!
nda-almost-secured-two-thirds-majority-to-pass-delimitation-bill-in-monsoon-session-as-latest-report

పార్లమెంట్ లో బిల్లుల ఆమోదానికి తుది కసరత్తు

కాగా, అవసరమైన మెజారిటీకి ఇది ఇంకా 36 ఓట్ల దూరంలోనే ఉంటుంది. DMK కు చెందిన 22 మంది ఎంపీలు, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి చెందిన ఎనిమిది మంది ఎంపీలు ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే అవకాశం ఉందనే రాజకీయ ఊహాగానాలు కూడా ఉన్నాయి. ఒకవేళ అలా జరిగితే, ఎన్‌డిఎ సంఖ్యాబలం 354కు చేరుకోవచ్చు. అప్పుడు మూడింట రెండు వంతుల మెజారిటీ మార్కుకు ఆరు ఓట్ల దూరంలోనే ఉండిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో, చిన్న పార్టీలు మరియు స్వతంత్ర ఎంపీల పాత్ర కీలకం అయ్యే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో డీలిమిటేషన్ విషయంలో అన్ని రాష్ట్రాలకు సమాన న్యాయం జరిగేలా లోక్‌సభ సీట్లను 50 శాతం వరకు పెంచితే తమ పార్టీ సానుకూలంగా ఆలోచన చేస్తుందని సుప్రియా సూలే ఇచ్చిన సంకేతాలు కీలకంగా మారాయి. దీంతో.. ప్రధాని మోదీ- షా తాము అనుకున్న విధంగా పార్లమెంట్ వేదికగా ఈ బిల్లులను అదే విపక్షాల ముందు ఆమోదించేలా చేస్తున్న కసరత్తు తుది దశకు చేరుకుంది. ఈ బిల్లులు ఆమోదం పొందితే రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+