కారులో 8 మంది సజీవ దహనం
పాట్నా: బీహార్‌లోని సరేన్ జిల్లా సోనిపూర్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది సజీవ దహనం అయ్యారు. ఓ పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఓ కారు, లారీ ఢీ కొనటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన జరిగిన వెంటనే కారులో మంటలు చెలరేగడంతో అందులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది సజీవ దహనం అయ్యారు. లారీ డ్రైవర్ మద్యం సేవించి వాహనాన్ని నడపటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications