హైదరాబాద్:తన భర్తపై పోలీసులు పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరుతూ గద్దర్ భార్య విమల రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఐవీ సుబ్బారావుకు వినతి పత్రం సమర్పించారు. ఎన్నికల సమయంలో ప్రజలను చైతన్యపరిచిన గద్దర్ పై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆమె ఆరోపించారు. అలాగే పోలీసులు సైతం గద్దర్ ని వేధింపులకు గురి చేస్తున్నారని ఆమె ఆ వినతిపత్రంలో విన్నవించారు. ఆయనకు సంబంధం లేని కేసుల్లో గద్దరుని ఇరికించారని తెలిపారు.