రాష్ట్రాన్ని ముంచేసిన కాంగ్రెస్: టిడిపి
హైదరాబాద్: అయిదేళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తి అస్తవ్యస్థంగా మారిందని తెదేపా విమర్శించింది. లక్షకోట్ల రూపాయల బడ్జెను రూపొందించిన ఘనత తమదేనని గొప్పలు చెప్పుకునే ఆర్థిక మంత్రి రోశయ్య ప్రభుత్వ పథకాలు, స్థితిగతులపై శ్వేతపత్రం విడుదల చేయాలని తెలుగుదేశం నాయకుడు ఉమ్మారెడ్డి వెంటేశ్వర్లు డిమాండ్ చేశారు. 2004లో 56వేల కోట్లున్న రాష్ట్ర అప్పు ఇప్పుడు లక్షా పదిహేడు వేలకు చేరిందని మండిపడ్డారు. ఎలాగూ దిగిపోతాన్నామనే ఉద్దేశంతో ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశారని వార ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే అన్ని పథకాలనూ చిత్తశుద్థితో అమలు పరుస్తామని మరో నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications