భోలక్‌పూర్ ఘటనపై కేసు నమోదు
హైదరాబాద్: భోలక్‌పూర్ కలుషిత నీటి ఘటనపై ముషీరాబాద్‌లో కేసు నమోదు అయింది. ఈ ఘటనలో తన కుటుంబ సభ్యుల ప్రాణాలు కోల్పోవడంతో దీనిపై మహ్మద్ అలీ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు పెట్టారు. సెక్షన్ 304 కింద వాటర్‌వర్క్స్ యాజమాన్యం మీద అతను ఫిర్యాదు చేశాడు. మంచినీటికి బదులు కలుషిత నీటిని సరఫర చేసి ప్రజల ప్రాణాలను తీసినందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తొంది. అయితే కేసును సీసీఎస్‌కు బదిలీ చేస్తున్నట్లు నగర కమీషనర్ ప్రసాదరావు తెలిపారు. సీసీఎస్ సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో విచారణ ప్రారంభం అయింది. ఈ ఘటనలో మొత్తం ఇప్పటి వరకు ఎనిమిది మంది చనిపోయారు.












Click it and Unblock the Notifications