నీరు కాదు,విషమన్నా..
హైదరాబాద్:భోలక్‌పూర్ బస్తీలో జలమండలి నుంచి వస్తున్న మంచినీటిలో 114 రెట్లు ఎక్కవ బాక్టీరియా ఉన్నట్లు ఇండియన్ ప్రీవెంటీ మెడిసిన్ (ఐపీఎం) రెండు నెలల క్రితమే వెల్లడించింది. ఈ ప్రాంతంలో కలుషితమైన నీరు తాగి ఎనిమిది మంది మరణించారు. భోలక్‌పూర్‌లోని ఓ ఇంటిలో ఫిబ్రవరి 3వ తేదిన ఓ ఇంటి వద్ద కోలాయిలోని పైపులైన్‌లోంచి వచ్చిన నీటి శాంపిల్స్‌ను తీసుకొని ఐపీఎం ఫిబ్రవరి నెలలోనే వాటర్‌వర్క్స్‌కు నివేదిక ఇచ్చింది. కానీ అధికారులు దాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు.
నివేదిక ప్రకారం తీసుకుంటే 100 మిల్లీలీటర్ల నీటిలో కేవలం 10 ఎంపీఎంలు మాత్రమే కోలిఫోం బాక్టీరియా ఉండాల్సింది, అయితే నీటిలో 1140 ఎంపీఎం కోలిఫోం బాక్టీరియా నమోదు అయింది. ఇది అత్యంత ప్రమాదకర స్థాయిలో దాదాపుగా 114 రెట్లు ఎక్కువగా బాక్టీరియా నమోదు అయింది. ఎట్టి పరిస్థితుల్లోను ఈ నీటిని తాగటానికి వీలులేదు...కానీ వాటర్‌వర్క్స్ అధికారులు దీన్ని ఏమాత్రం సీరియస్‌గా తీసుకోకపోవడంతో భోలక్‌పూర్‌లో దారుణ ఘటన జరిగింది. అయితే అధికారులు తోళ్ల పరిశ్రమ ఉండటం వల్లే ఈ సంఘటన జరిగిందని ఈ ఘటనను జరిగిందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications