ప్రజారాజ్యం నేతల నిరసన, అరెస్టు
హైదరాబాద్: భోలక్‌పూర్ కలుషిత నీటి సంఘటనలో అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ గురువారం నాడు ప్రజారాజ్యం పార్టీ నేతలు సచివాలయం ముందు ధర్నాకు దిగారు. భోలక్‌పూర్ ఘటనకు సర్కారు నైతిక బాధ్యత వహిస్తూ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ప్రజారాజ్యం పార్టీ నేతలు సచివాలయం ముందు బైఠాయించి నిరసన నినాదాలు చేశారు. ఇంతలో పోలీసులు వచ్చి పిఆర్పీ నేతలను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు.












Click it and Unblock the Notifications