ప్రమాదంపై సిఐడి విచారణ షురూ
హైదరాబాద్: సచివాలయంలోని డి - బ్లాకులో గురువారం జరిగిన అగ్ని ప్రమాదంపై సిబిసిఐడి శుక్రవారం విచారణ ప్రారంభించింది. సచివాలయంలో జరిగిన అగ్ని ప్రమాదాన్ని సమీక్షించి దర్యాప్తు చేసేందుకు సీఐడీ ఐజీ పున్నారావు శుక్రవారం ఉదయం డీ - బ్లాక్‌ను సందర్శంచారు. ప్రమాదానికి కారణాలను అన్వేషించి పూర్తి నివేదికను అందజేస్తామని ఆయన చెప్పారు. విచారణ నిమిత్తం డి - బ్లాకులోకి క్లూస్ టీంలను రప్పించారు.
డి - బ్లాకులోకి ఉద్యోగులను అనుమతించలేదు. విచారణ జరుగుతున్నందున ఉద్యోగులను లోనికి అనుమతించడం లేదని అధికారులు చెప్పారు. దీంతో ఉద్యోగులు ఆందోళనకు దిగారు. డీ - బ్లాకును సందర్శించడానికి వచ్చిన సిపిఎం నేత నోముల నర్సింహయ్యను కూడా తొలుత లోనికి అనుమతించలేదు. ఉద్యోగుల ఆందోళన కారణంగా ఆయనను తర్వాత అనుమతించారు. కీలకమైన ఫైళ్లు ఉన్న డీ - బ్లాకులో అగ్ని ప్రమాదం సంభవించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications