'ఫైళ్లు భద్రం' : 'ప్రభుత్వ అసమర్థత'
హైదరాబాద్: సచివాలయంలో జరిగిన అగ్నిప్రమాదంలో కేవలం సామాన్లు మాత్రమే కాలిపోయాయని, దస్తావేజులు, ఇతర పత్రాలు సురక్షితంగా ఉన్నాయని రాష్ట్ర అటవీశాఖ మంత్రి శత్రుచర్ల విజయరామారాజు చెప్పారు. ప్రమాదం జరిగిన డి-బ్లాక్‌ను ఆయన శుక్రవారం సందర్శించారు. అటవీశాఖకకు సంబంధించిన ఫైళ్లన్నీ భద్రంగా ఉన్నాయని, సర్వర్లు మాత్రమే కాలిపోయాయని ఆయన మీడియా ప్రతినిధులకు తెలిపారు. ఈ మధ్యాహ్నం నుంచి కార్యకలాపాలు యథావిధిగా జరుగుతాయని వివరించారు.
సచివాలయంలో అగ్నిప్రమాదం జరగడంపై సీపీఎం శాసనసభాపక్ష నాయకుడు నోముల నర్సింహయ్య విస్మయం వ్యక్తం చేశారు. ఆధునిక హంగులతో కూడిన డి-బ్లాక్‌లో ప్రమాదం జరిగే అవకాశమే లేదని ఆయన మీడియా ప్రతినిధుల వద్ద అభిప్రాయపడ్డారు. జరిగిన ప్రమాదం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై నిష్పాక్షింగా విచారణ జరిపించాలన ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications