లొంగిపోయిన జెసి ప్రభాకర్ రెడ్డి
అనంతపురం: కాంగ్రెస్ నాయకుడు, రాష్ట్ర మంత్రి జెసి దివాకర్ రెడ్డి సోదరుడు జెసి ప్రభాకర్ రెడ్డి శుక్రవారం ఉదయం అనంతపురం జిల్లా తాడిపత్రిలో మెజిస్ట్రేట్ ముందు లొంగిపోయారు. పదిహేను రోజుల క్రితం తాడిపత్రిలో జరిగిన దాడి కేసులో ఆయన మెజిస్ట్రేట్ ముందు లొంగిపోయారు. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరైంది.
పదిహేను రోజుల క్రితం తాడిపత్రిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పేరం నాగిరెడ్డి, ఇతర తెలుగుదేశం నాయకుల ఇళ్లపై దాడులు జరిగాయి. దీంతో పరస్పరం కాంగ్రెసు, తెలుగుదేశం కార్యకర్తలు దాడులు చేసుకున్నారు. దీంతో తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ సంఘటనలో జెసి ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. అప్పటి నుంచి ప్రభాకర్ రెడ్డి పోలీసులకు చిక్కలేదు. చివరకు శుక్రవారం మెజిస్ట్రేట్ ముందు లొంగిపోయారు.












Click it and Unblock the Notifications