ర్యాగింగ్ పై సుప్రీం కొరడా
న్యూఢిల్లీ: విద్యాసంస్థల్లో ర్యాగింగ్ ను ఎదుర్కొనేందుకు నిరోధక కమిటీలను ఏర్పాటు చేయాలని రాష్ట్రాలకు సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.ర్యాగింగ్‌లో గాయపడిన వారికి ప్రభుత్వమే చికిత్స చేయించాలని, కళాశాలలో డ్రగ్స్ వాడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. హిమాచల్ ప్రదేశ్ లోని వైద్య కళాశాలలో ర్యాగింగ్ భూతానికి బలైన అమన్ కుచ్రూ కుటుంబ సభ్యులు వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఆ ఆదేశాలు జారీ చేసింది.
దేశవ్యాప్తంగా ర్యాగింగ్ బాధితులకు ఆదుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది.విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇవ్వడానికి మానసిక వైద్యుడ్ని కళాశాలల్లో నియమించాలని కూడా సూచించింది. మార్చి 8వ తేదీన జరిగిన అమన్ కుచ్రూ మరణంపై హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. తలకు తగిలిన దెబ్బ వల్ల కుచ్రూ మరణించినట్లు పోస్టు మార్టం నివేదికలో వెల్లడైంది.












Click it and Unblock the Notifications