కడప: ప్రతిపక్షాలది దివాళాకోరు రాజకీయమని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి మండిపడ్డారు. సచివాలయంలోని డి - బ్లాకులో జరిగిన అగ్ని ప్రమాదంలో కీలకమైన ఫైళ్లు కాలిపోయాయని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు.
సచివాలయంలోని ఫైళ్లు భద్రంగా ఉన్నాయని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. కాలిపోయిన ఫైళ్ల బ్యాకప్ ఫైళ్లు ఉంటాయని ఆయన చెప్పారు. దగ్ధమైన డీ - బ్లాక్ వారంలోగా పని చేయడం ప్రారంభిస్తుందని ఆయన చెప్పారు.