తెలంగాణకై ఇక ఉద్యమం:గద్దర్
హైదరాబాద్ : ఓట్ల ద్వారా తెలంగాణ రాదని కేవలం ప్రజాఉద్యమాల ద్వారానే రాష్ట్రం ఏర్పడుతుందని ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు. ఇన్ని రోజులుగా ఎవరు తెలంగాణ ఇస్తానంటే వారి వెంట వెళ్లి పాటలు పాడానని ఇకపై ప్రజ ఉద్యమాన్ని ప్రారంభిస్తానని ఆయన తెలిపారు. గద్దర్ తన 45 రోజుల అజ్ఞాతం వీడి జనావాసంలోకి వచ్చారు. గధ్దర్ పై ఉన్న కేసులను ప్రభుత్వం ఎత్తివేయటంతో ఆయన ప్రజల్లోకి వచ్చారు.ఆదివారం ఉదయం ఆయన ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా అంజలి ఘటించారు. కాగా గద్దర్ పై కేసులు ఎత్తివేయటంతో ఆయన భార్య విమల ప్రభుత్వానికి కృతజ్ఞత తెలిపారు.












Click it and Unblock the Notifications