జయప్రద వైయస్ పాట

Jayaprada
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేసిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల వల్లే ప్రజలు ఆయనకు తిరిగి పట్టం కట్టారని రాంపూర్‌ నుంచి రెండోసారి లోక్‌ సభకు ఎన్నికైన జయప్రద అన్నారు. తాము రాంపూర్‌ లో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టినందువల్లనే ప్రజలు గెలిపించారని, అభివృద్ధికి ఎక్కడైనా ప్రజలు పెద్ద పీట వేస్తారని అన్నారు. రాంపూర్‌ గ్రామాల్లో రహదారి సౌకర్యాలు, వంతెనలు నిర్మించి, కళాశాలలు ఏర్పాటు చేసినందువల్లనే జనం తనను గెలిపించారన్నారు. హిందీ అకాడమీ చైర్మన్‌ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ తో కలిసి ఆమె సోమవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

తెలుగుదేశం తన పట్ల 'ఉపయోగించుకొని వదిలేసే పద్ధతి'ని అనుసరించినందువల్లే తాను ఆ సైకిల్‌ను వదిలేసి ఎస్పీ సైకిల్‌పై ప్రయాణించానన్నారు. టీడీపీ గెలుపులో తాను కీలక పాత్ర వహించినప్పటికీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తనను అవమానించారన్నారు. రాంపూర్‌ ప్రజలు తనను ఎంతో ఆదరించారన్నారు. అక్కడ కూడా పార్టీలో తాను సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ పార్టీ నాయకత్వం తనకు అండగా నిలిచిందన్నారు. తనను ప్రత్యర్థులు నీచంగా అవమానించినప్పటికీ ఒక మహిళగా ఎన్నో సమస్యలు ధైర్యంగా ఎదుర్కొన్నానని చెప్పారు. సినీతారలను చూడడానికి జనం వేలంవెర్రిగా వస్తారని, అదే తారలు రాజకీయాల్లోకి ప్రవేశిస్తే వారిని నీచంగా చూస్తారని అన్నారు. ఎస్పీ కేంద్ర ప్రభుత్వంలో చేరే అవకాశాలు లేకపోలేదని ఆమె అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+