కాలమే జవాబు చెప్తుంది: రాహుల్

Rahul Gandhi
న్యూఢిల్లీ: తాను మంత్రివర్గంలో చేరే విషయమై కాలమే సమాధానం చెబుతుందని కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీ అన్నారు. మంత్రివర్గంలో చేరాలని ప్రధాని మన్మోహన్ సింగ్ ఆహ్వానిస్తున్నట్లు, అందుకు రాహుల్ గాంధీ నిరాకరిస్తున్నట్లు గత రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు కాలమే సమాధానం చెబుతుందని ఆయన మంగళవారం బదులిచ్చారు.

పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కొత్తగా లోకసభకు ఎన్నికైన సభ్యులు రాహుల్ గాంధీని అభినందించారు. సిపిపి సమావేశంలో ఆయన చివరి వరుసలో కూర్చున్నారు. ఆ సమావేశంలో సోనియా గాంధీని చైర్ పర్సన్ గా తిరిగి ఎన్నుకున్నారు. అనంతరం సిపిపి నేతగా ఆమె మన్మోహన్ సింగ్ ను నామినేట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+