సుధాకర్ ఎన్‌కౌంటర్ న్యాయమే
హైదరాబాద్ : ఎన్‌కౌంటర్‌తో పటేల్ సుధాకర్‌రెడ్డికి సరైన న్యాయం జరిగిందని మాజీ హోంమంత్రి మాధవరెడ్డి సతీమణి ఉమా మాధవరెడ్డి పేర్కొన్నారు. హోంమంత్రి హోదాలో శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్న తన భర్తను నక్సల్స్ అన్యాయంగా చంపివేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలందరికీ న్యాయం జరిగిందని ఆమె అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇది బూటకపు ఎన్‌కౌంటర్ కాదని, ప్రజలకోసం పనిచేసే ప్రజాప్రతినిధులను ఎంతోమందిని నక్సలైట్లు హతమార్చారని, వీరికి సరైన శిక్ష పడిందని ఆమె తెలిపారు. ఇకనైనా అజ్ఞాతం, హింసను వీడి జన జీవన స్రవంతిలో కలవాలని ఆమె హితవు పలికారు.












Click it and Unblock the Notifications