పోలీసులు కాల్చి చంపారు: వరవరరావు
హైదరాబాద్: మావోయిస్టు అగ్రనేత పటేల్‌సుధాకర్‌ను వారిని పట్టుకొచ్చి పోలీసులు కాల్చి చంపారు అని విరసం నేత వరవరరావుఆరోపించారు. వరంగల్ జిల్లా తాండ్వాయి మండలం లవ్వాల అటవీ ప్రాంతంలో ఈ తెల్లవారు జామున జరిగిన ఎన్‌కౌంటర్ బూటకమే అని మావోయిస్టు ఆయన చెప్పారు. మరోవైపు మానవహక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బుర్రా రాములు కూడా ఈ ఎన్‌కౌంటర్‌పై అనుమానం వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా లవ్వాలలో మావోయిస్టుల కదలికలు లేవని ప్రకటించిన పోలీసులు ఇప్పుడు అక్కడ ఎన్‌కౌంటర్‌లో అగ్రనేత చనిపోయినట్లు చెబుతున్నారు. ఇది బూటకపు ఎన్‌కౌంటరే అని ఆయన చెప్పారు. నక్సల్స్ లేవనెత్తిన మౌలిక సమస్యలను పరిష్కారం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications