వెస్ట్ బెంగాల్లో తుఫాను: 12 మంది మృతి

తీర దక్షిణ 24 పరగణాస్ జిల్లాలో సైన్యాన్ని అప్రమత్తం చేసినట్లు, పోలీసు, బిఎస్ఎఫ్ బలగాలు సహాయ చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య చెప్పారు. చెట్టు కూలి మీద పడడంతో ఇద్దరు వ్యక్తుల మరణించారని, తూర్పు కోల్ కత్తాలో మరో వ్యక్తి మరణించాడని కోల్ కత్తా పోలీసు కమిషనర్ గౌతమ్ మోహన్ చక్రవర్తి చెప్పారు. చెట్లు కూలి రోడ్డుపై పడడంతో 32 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. విద్యుత్ సరఫరాను నిలిపేశారు.
భారీ వర్షాల కారణంగా ఒరిస్సాలోని తీర ప్రాంతంలో జన జీవనం అస్తవ్యస్తమైంది. పెనుగాలులు కూడా వీస్తున్నాయి. ఐలాగా పిలుస్తున్న తుఫాను చాంద్ బలికి 140 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. కటక్, జగత్ సింగ్ పూర్, కేంద్రపారా, భద్రక్, బాలాసోర్ ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి.












Click it and Unblock the Notifications