ఎయిర్ ఇండియా కార్గోలో దోపిడీ
ముంబయి: ముంబయి విమానాశ్రయంలోని ఎయిర్ ఇండియా కార్గో కాంప్లెక్స్ లో సోమవారం దోపిడీ జరిగింది. వంద కిలోల బంగారం, వెండి పాకెట్లను నలుగురు గుర్తు తెలియన సాయుధులు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటనలో ఒక సెక్యూరిటీ గార్డు గాయపడ్డాడు. అతన్ని వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
రివాల్వర్ ధరించిన వ్యక్తులు హై సెక్యూరిటీ జోన్ లోకి దూసుకొచ్చి సెక్యూరిటీ గార్డు కాల్చేస్తామని బెదిరించారు. కార్గో ఏరియాలో ప్రవేశిస్తుండగా అడ్డగించిన పదునైన వస్తువుతో కొ్ట్టారు. దీంతో అతను గాయపడ్డాడు. దొంగతనానికి పాల్పడి నలుగురు ఆగంతకులు కూడా పారిపోయారు.












Click it and Unblock the Notifications