కొత్త వారికీ చాన్స్: వైయస్
న్యూఢిల్లీ: తన మంత్రి వర్గంలో కొత్త వారికి కూడా చాన్స్ ఉంటుందని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసిన తర్వాత ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వైయస్ రాజశేఖర రెడ్డికి తమ మంత్రివర్గంలోకి 35 మందిని తీసుకునే అవకాశం ఉంది. మంత్రుల ప్రమాణ స్వీకారం సోమవారం సాయంత్రం గం.6.40 నిమిషాలకు జరుగుతుంది. రాత్రి 8 గంటలకు తొలి మంత్రి వర్గ సమావేశం జరుగుతుంది. మంగళవారం ముఖ్యమంత్రి వైయస్ ఇజ్రాయెల్ వెళ్తారు.
ఓడిపోయినవారికి, తొలిసారి శాసనసభకు గెలిచినవారికి మంత్రి వర్గంలో స్థానం దక్కే అవకాశం లేదు. శాసనమండలి నుంచి మాజీ మంత్రి కె.రోశయ్యకు మాత్రమే మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. ఈ స్థితిలో టి. జీవన్ రెడ్డికి మంత్రి వర్గంలో చోటు దక్కే అవకాశం లేదు. సోమవారం సాయంత్రం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయాల్సిన వారికి ఫోన్ ల ద్వారా సమాచారం వెళ్లింది. ఇంతకు ముందు మంత్రులుగా పని చేయనివారికి ఈసారి అవకాశం దక్కవచ్చు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వట్టి వసంతకుమార్ లాంటి వారికి ఈసారి మంత్రి వర్గంలో స్థానం దక్కుతుంది.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications