వైయస్ ను ఎదుర్కుంటాం: బాబు

Chandrababu Naidu
చిత్తూరు: అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలపై వివక్షను పాటిస్తే ఈసారి సహించేది లేదని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రెండు రోజుల కుప్పం నియోజకవర్గ పర్యటనలో ఆదివారం ఆయన రామకుప్పం, శాంతిపురం మండలాల్లో రోడ్‌ షోలు నిర్వహించారు. కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధికి దూరం చెయ్యాలని ముఖ్యమంత్రి యత్నిస్తున్నారని ఆరోపించారు. తనకు ఓట్లు వేసిన ప్రజలకు అన్యాయం చేస్తే ఊరుకోబోనన్నారు. కుప్పం నియోజకవర్గాన్నీ పులివెందులలా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందన్నారు.

దురదృష్టవశాత్తు తమ పార్టీ అధికారంలోకి రాలేదని, పార్టీ ఓటమికి అనేక కారణాలున్నాయని, వాటిని విశ్లేషించి, మరోసారి ఈ తప్పిదం జరక్కుండా జాగ్రత్త పడతానన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి 36 శాతం ఓట్లు వస్తే ప్రతిపక్షాలకు 64 శాతం ఓట్లు వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. అధికారంలో ఉన్నామన్న గర్వంతో తమ పార్టీ కార్యకర్తలపై దాడులు జరిపితే సహించమని, కాదని ముందుకొస్తే ఎదుర్కొనే సత్తా ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి ఎంత మంది కార్యకర్తలున్నారో తమ పార్టీకీ అంతే సంఖ్యలో ఉన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. తమ కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగా గొడవలకు దిగబోరని, అలాగని రెచ్చగొడితే ఎదురు తిరుగుతామని అన్నారు. కుప్పంలో కాంగ్రెస్‌ పార్టీ అరాచకాలు పెచ్చుమీరాయని ఆరోపించారు. గ్రామాలకు గ్రామాల్లో కరెంటు కనెక్షన్లు తొలగించడం, తాగునీరు రాకుండా అడ్డుకోవడం, తెదేపా కార్యకర్తలపై దౌర్జన్యాలు వంటి చర్యలకు పూనుకోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+