విస్తరణ: తుది జాబితా రెడీ

Manmohan Singh
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ విస్తరణపై తుది కసరత్తు నిమిత్తం ప్రధాని మన్మోహన్‌ సింగ్‌తో బుధవారం సోనియా గాంధీ భేటీ అయ్యారు. తన రాజకీయ కార్యదర్శి అహ్మద్‌ పటేల్‌తో కలిసి ప్రధాని నివాసానికి వచ్చిన సోనియా, ఆ వెంటనే మన్మోహన్‌‌తో ఆయన కార్యాలయంలో చర్చల్లో నిమగ్నమయ్యారు. మిత్రపక్షాలతో ఎప్పటికప్పుడు ఫోనులో సంప్రదిస్తూనే మంత్రివర్గ కూర్పుపై సోనియా, మన్మోహన్‌ సొంత పార్టీ శ్రేణులకు సముచిత స్థానాలు కల్పించడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

ఈ మేరకు ఇప్పటికే మమతా బెనర్జీకి, కరుణానిధికి సోనియా స్వయంగా రెండుసార్లు ఫోన్‌ చేసి ఎవరెవరికి ఏఏ స్థానాలు కేటాయిస్తున్నదీ చెప్పడంతో పాటు వారి అభ్యంతరాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. దీనితో ఆ పార్టీ ప్రతినిధులు ఇక సోనియాను గానీ, మన్మోహన్‌ ను గానీ కలిసే అవకాశం కనపడడం లేదు. జాబితా ఖరారైన తర్వాత మిత్రపక్షాలకు ఫోన్‌ ద్వారానే సమాచారం అందించవచ్చని ప్రధాని కార్యాలయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ చర్చలు ఇలా జరుగుతూ వుండగానే రేపు ఉదయం 11.30 గంటలకు మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి శ్రేణులు సన్నద్దమవుతున్నాయి.

దయానిధి మారన్, ఫరూక్ అబ్దుల్లా, అజయ్ మాకెన్, వీర్ భద్రసింగ్, పృథ్వీరాజ్ చౌహాన్, ఆస్కార్ ఫెర్నాండెజ్, శ్రీప్రకాష్ జైస్వాల్, జికె వాసన్, భక్తచరణ్ దాస్, మల్లికార్జున్ ఖర్గే, ఎం.రామచంద్రన్, కెవి థామస్ లకు మంత్రి పదవులు దక్కుతాయని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వీరికి ప్రధాని కార్యాలయం నుంచి ఫోన్ కాల్స్ వెళ్లినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+