నాపై రాక్షస ప్రచారం: డిఎస్

ఎన్నికల ఫలితాలకు తెలంగాణవాదానికి సంబంధం లేదని ఆయన అన్నారు. తెలంగాణపై తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయం తీసుకుంటారని ఆయన చెప్పారు. తాను, ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి జంటగా పని చేసి పార్టీకి విజయాన్ని సాధించి పెట్టామని ఆయన చెప్పుకున్నారు. పార్టీ దెబ్బ తిన్న చోట పునర్నిర్మిస్తామని ఆయన చెప్పారు. నామినేటెడ్ పదవులను త్వరలో భర్తీ చేస్తామని కూడా ఆయన చెప్పారు. ప్రస్తుతం లభించిన విజయం స్ఫూర్తితో మరింత ముందుకు పోతామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications