తెలంగాణపై వెనక్కి తగ్గం: బాబు

Chandrababu Naidu
హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా తాము తీసుకున్న నిర్ణయంలో ఏ విధమైన మార్పు లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తెలంగాణపై తాము స్పష్టంగా తమ నిర్ణయాన్ని చెప్పామని, దాంట్లో మార్పు లేదని ఆయన అన్నారు. టీడీపీ మహానాడు బుధవారం సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్‌ గార్డెన్స్‌లో ప్రారంభమైంది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పార్టీ జెండాను ఆవిష్కరించి సభను ప్రారంభించారు. అంతకు ముందు అక్కడ పార్టీ కార్యకర్తలు ఏర్పాటుచేసిన రక్తదానశిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.

ఎన్నికల సమయంలో పని చేసి, ఇతర సమయాల్లో పని చేయకపోవడం సరి కాదని, అన్ని వేళలా సవాళ్లను ఎదుర్కోవడానికి పని చేయాల్సిన అవసరం ఉంటుందని ఆయన అన్నారు. యువత ఆకాంక్షలకు అనుగుణంగా, మారిన పరిస్థితులకు అనుగుణంగా కార్యక్రమాలను చేపట్టే ఆలోచన చేయాలని ఆయన పార్టీ నాయకులకు సూచించారు. తాము ఎప్పుడు అధికారంలోకి వచ్చినా నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తామని ఆయన చెప్పారు. నగదు బదిలీ పథకంపై ప్రజలను చైతన్యవంతులను చేయాలని ఆయన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు సూచించారు.

రాష్ట్రంలో బియ్యం ధర పెరుగుతోందని, రైతుల వరి ధాన్యాన్ని కొనే పరిస్థితి లేదని ఆయన చెప్పారు. కాంగ్రెస్, టిడిపి మాత్రమే ఉన్నప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమకు పడేదని, ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి తమకు నష్టం జరిగిందని ఆయన అన్నారు. ఎన్నికల్లో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, కాంగ్రెసు పార్టీ విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టినట్లు ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యం చిన్నబోయే విధంగా కాంగ్రెసు పార్టీ డబ్బులు ఖర్చు పెట్టిందని ఆయన విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+