పిఆర్పీ నేతలకు బాబు గాలం?

రంగారెడ్డి జిల్లాకు చెందిన టి.దేవేందర్ గౌడ్, ఉత్తరాంధ్రకు చెందిన తమ్మినేని సీతారాం, కళా వెంకట్రావు, ఘంటా శ్రీనివాసరావు, గోదావరి జిల్లాలకు చెందిన కోటగిరి విద్యాధర రావు, రాయలసీమకు చెందిన భూమా నాగిరెడ్డి తదితర నాయకులను తిరిగి పార్టీలోకి తీసుకోవాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రజారాజ్యం పార్టీ వ్యవహారాల పట్ల వారు విసిగి ఉన్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో తాము వారిని తీసుకోవడానికి సుముఖంగా ఉండాలనేది చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు. ఈ విషయంపై ఆయన పార్టీ నాయకులతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది.
బుధవారం జరుగుతున్న మహానాడులో తమ పార్టీ వైఖరిని తేటతెల్లం చేయడం ద్వారా, తమ శక్తి ఉడిగిపోలేదని చాటుకోవడం ద్వారా ఇతర పార్టీలకు వలస వెళ్లిన వారిని తీసుకునేందుకు సంకేతం ఇవ్వాలని చంద్రబాబు ఆలోచన.












Click it and Unblock the Notifications