మైటాస్: ప్లాంట్ కూలి 3గురు మృతి
విజయవాడ: కృష్ణా జిల్లా విజయవాడ సమీపంలోని కొండపల్లి వద్ద నిర్మాణంలో ఉన్న నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీ యూనిట్ కూలి ముగ్గురు కూలీలు మరణించారు. మరో 12 మంది కూలీలు గాయపడ్డారు. ఈ విషాద సంఘటన శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. మృతుల్లో ఇద్దరు పశ్చిమ బెంగాల్ కు చెందినవారు కాగా, మరో కూలీ కొండపల్లికి చెందినవాడే.
కూలిపోయిన యూనిట్ నిర్మాణం మైటాస్ ఆధ్వర్యంలో జరుగుతోంది. యూనిట్ మూడో అంతస్థు కూలి వరుసగా అన్ని అంతస్థులు కూలాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ 30 మంది కూలీలు పని చేస్తున్నారు. ఈ ప్రమాదం సంభవించి గంటలు గడిచినప్పటికీ మైటాస్ ప్రతినిధులు గానీ ఇతరులు గానీ అక్కడ కనిపించలేదు.












Click it and Unblock the Notifications