కాంగ్రెస్, టిడిపిల మధ్య ఘర్షణ
ఆదిలాబాద్: ఉపాధి హామీ పనుల విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరిగి దాడులకు దారితీసిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. ఇచ్చోడ మండలం గుండాలలో ఉపాధి హామీ పనుల విషయంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం మొదలైంది. అది ముదిరి వేటకొడవళ్లతో పరస్పరం దాడులకు దిగారు. ఈ దాడిలో 30 మంది దాకా గాయపడినట్లు సమాచారం.
గాయపడినవారిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పోలీసులు రంగప్రవేశం చేసి గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు రంగ ప్రవేశంతో గొడవ సద్దుమణిగింది.












Click it and Unblock the Notifications