హైదరాబాద్ లోని ఇంట్లో చోరీ
హైదరాబాద్: బంధువుల పెళ్లికి వెళ్లి వచ్చేలోగా ఇల్లు ఖాళీ అయిన ఉదంతం హైదరాబాద్‌లో జరిగింది. ఉప్పల్ లోని సాయిచిత్రనగర్ లో నివాసం ఉండే బట్టల వ్యాపారి అనిల్ కుమార్ బంధువుల ఇంట్లో పెళ్లికోసం కుటుంబంతో కలిసి వెళ్లారు. ఆ సమయంలో కొందరు వ్యక్తులు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు.
దొంగలు బీరువాలో ఉన్న 26 తులాల బంగారు నగలు, మూడు లక్షల నగదు ఎత్తుకెళ్లారు. శబ్దాలకు ఇరుగుపొరుగు లేచి దొంగల వెంట బడినా వారు దొరకలేదు. దాంతో వారు, ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీకి పాల్పడింది పేరుమోసిన దొంగ మంత్రి శంకర్ గా అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications