ఇది ఓటమి కాదు: బాలయ్య

Balakrishna
హైదరాబాద్: ఎన్నికల్లో తాము ఓడిపోలేదని, అది ఓటమి కాదని ప్రముఖ సినీ నటుడు, తెలుగుదేశం నాయకుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. చాలా సీట్లు స్వల్ప మెజారిటీతో కోల్పోయామని ఆయన చెప్పారు. తెలుగుదేశం మహానాడు కార్యక్రమంలో ఆయన గురువారం మాట్లాడారు. ఓటమికి కారణాలు ఎన్నో ఉన్నాయని, ఆ కారణాలు తనకు తెలుసునని ఆయన అన్నారు. ఆ ఓటమికి నిరాశా నిస్పృహలకు గురి కావద్దని ఆయన పార్టీ కార్యకర్తలకు సూచించారు. జరిగిందేదో జరిగింది, దాన్ని తలుచుకుని నిరాశకు లోను కావద్దని ఆయన అన్నారు.

పార్టీ పల్లకీని మోసిన బోయీలు కార్యకర్తలని, పార్టీకి వారే ముఖ్యమని ఆయన అన్నారు. మడమ తిప్పకూడదని, పార్టీ విజయం కోసం కృషి చేయాలని ఆయన అన్నారు. తన ఊపిరి ఎన్టీఆర్ దని, తన ఆశయం ప్రజలదని, తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం కల్పించే వరకు నిద్రపోనని ఆయన అన్నారు. ఇప్పుడే ఎన్నికలని పోరాడాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటితే చంద్రబాబు మేధస్సుకు గుర్తింపు తెచ్చారని ఆయన ప్రశంసించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+