పోలీసు కేంద్రంలో స్త్రీపై దారుణం
చిత్తూరు: చిత్తూరులోని పోలీసు శిక్షణా కేంద్రంలో వంట మనిషిపై సామూహిక అత్యాచారం జరిగింది. అవమాన భారం భరించలేక ఆ మహిళ గొంతు కోసుకుని ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించింది. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు. డిఎస్పీ ముందు ఆమె వాంగ్మూలం ఇచ్చింది. ఆర్ ఎస్ ఐపై, అతని మిత్రులపై ఆమె ఆ వాంగ్మూలంలో ఆరోపణలు చేసింది.
పోలీసులు తనపై సామూహిక అత్యాచారం జరిపారని ఆ మహిళ ఆరోపించింది. సెల్ ఫోన్ తో తన నగ్న చిత్రాలను తీశారని కూడా ఆమె చెబుతోంది. కౌలుట్లయ్య, అతని మిత్రులు ఈ దారుణానికి పాల్పడినట్లు ఆమె ఆరోపిస్తోంది.












Click it and Unblock the Notifications