వలస నేతలతో అల్లు అరవింద్ భేటీ

ప్రజారాజ్యం పార్టీలోని వలస నేతలకు చంద్రబాబు పోనులు చేస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు తమకు ఫోన్ చేసినా ఆశ్చర్యం లేదని తమ్మినేని సీతారాం ఇంతకు ముందు అన్నారు. ఈ నేతలంతా జారిపోతారనే భయంతో అల్లు అరవింద్ ఈ సమావేశం ఏర్పటు చేసినట్లు భావిస్తున్నారు. అయితే తాము తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేది లేదని తమ్మినేని సీతారాం చెప్పారు. ఈ సమావేశంలో టి.దేవేందర్ గౌడ్, తమ్మినేని సీతారాం, కోటగిరి విద్యాధర రావు, భూమానాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి తదితరులు ున్నారు. తిరుపతి పర్యటనలో ఉన్న ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి శనివారం హైదరాబాద్ వస్తున్నారు.












Click it and Unblock the Notifications